ఇంకెప్పుడు కొంటరు?.. కూలీలు లేరు.. లారీలు వస్తలేవు
ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జ్యాపం జరుగుతున్నదని, లారీల కొరతతో కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలంటూ పలు జిల్లాల్లో బుధవారం ఆందోళనకు దిగారు.
- 20 రోజులు దాటినా కాంటా పెడ్తలేరు
- పలు జిల్లాల్లో రోడ్డెక్కిన రైతులు
- ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 13 : ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జ్యాపం జరుగుతున్నదని, లారీల కొరతతో కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలంటూ పలు జిల్లాల్లో బుధవారం ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కోర్పోలులో ధాన్యం కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ సుల్తాన్పూర్ వద్ద సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గంటపాటు నిరసన తెలిపారు. గ్రామంలో రెండు కేంద్రాల అవసరం ఉండగా, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఒకే కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని, నెల రోజులు గడుస్తున్నప్పటికీ తూకం వేయకుండా టోకెన్లు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. అటువైపు వెళ్తున్న జిల్లా అదనపు కలెక్టర్ పాండు రైతుల వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు.

డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం ఇన్చార్జి వంశీ నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నాడని అదనపు కలెక్టర్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. రెండు, మూడు రోజుల్లో హమాలీలను సమకూర్చి ధాన్యం తూకం వేయిస్తానని అదనపు కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేటలో రైతులు రాస్తారోకోకు దిగారు. వెంటనే లారీలు వచ్చేలా చూడాలని, ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తహసీల్దార్ శివప్రసాద్, రామాయంపేట సీఐ అక్కడికి చేరుకొని కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని రైతులకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కొనుగోలు కేంద్రాల్లో రైతులు బాధలు పట్టించుకోవడం లేదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. వడ్లు, మక్కల కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పెనుబల్లిలో బుధవారం ధర్నా నిర్వహించారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలంటూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

