రాజన్న సిరిసిల్ల, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో కామారెడ్డి-కరీంనగర్ రహదారిపై వడ్లను పోసి రాస్తారోకో చేపట్టారు. అట్టహాసంగా సెంటర్లు ప్రారంభించిన అధికారులు కొనుగోళ్లు చేపట్టక పోవడంతో ఆదివారం నిరసనకు దిగారు. వందమందికి పైగా రైతులు కామారెడ్డి- కరీంనగర్ రోడ్డుపై బైఠాయించారు. అరగంటకు పైగా వాహనా లు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాతనే మాట్లాడాలని పట్టుబట్టారు. వెం టనే ఆయన కొనుగోళ్లు ప్రారంభించాల ని అధికారులను ఆదేశించడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు.
జవాన్లపై మావోయిస్టుల దాడి! ; ఆపై ఆయుధాల అపహరణ
కొత్తగూడెం క్రైం, నవంబర్ 3 : ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు జ వాన్లపై మెరుపుదాడి చేసి, వారి ఆయుధాలను తస్కరించారు. ఈ ఘటన ఆదివారం జగర్గుండా మార్కెట్లో చోటుచేసుకున్నది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జగర్గుండా మార్కెట్లో పహారా కాస్తున్న జవాన్లపై సివిల్ దుస్తుల్లో వచ్చిన మావోయిస్టు స్మాల్ యాక్షన్ టీమ్ మెరుపుదాడి చేసింది. సోడి, దేవా అనే జవాన్లపై మావోయిస్టులు పదునైన ఆయుధాలతో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచి వారి వద్ద ఉన్న ఆయుధాలను ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న జగర్గుండా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లకు ప్రాథమిక చికి త్స నిర్వహించి, మెరుగైన చికిత్స నిమి త్తం ఎయిర్ లిఫ్ట్ ద్వారా రాయ్‌పూర్ దవాఖానకు తరలించారు.