నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 16: రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల యూరియా టోకెన్ల కోసం పలు చోట్ల అన్నదాతలను పోలీస్ స్టేషన్లకు తరలించి ఠాణా బయట ఎండలో నిలబెట్టి టోకెన్లు పంపిణీ చేయగా పలు విమర్శలకు తావిచ్చిన విషయం మరిచిపోకముందే మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్‌కు కర్షకులను తరలించి పోలీసు పహారాలో యూరియా టోకెన్లు పంపిణీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల తీరుపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా సొసైటీల్లో పోలీసుల పహారా మధ్య అరకొర యూరియా పంపిణీ చేశారు. యూరియా లభించక పలుచోట్ల కర్షకులు రాస్తారోకోలు చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకలో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. జనగామ జిల్లాస్టేషన్ఘన్పూర్లో లైన్లో నిలబడిని మహిళా రైతు సొమ్మసిల్లి పడిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపహాడ్‌లో సమయానికి యూరియా లభించకపోవడంతో ఆవేదనకు గురైన అన్నదాత తన రెండున్నర ఎకరాల మక్కపంటలో పశువులను మేపాడు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులు
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోని సొసైటీ వద్ద యూరియా కోసం లైన్లో నిలబడి స్పృహ తప్పి పడిపోయిన తానేదార్పల్లికి చెందిన రేణుకకు మంచి నీళ్లు తాగిస్తున్న మహిళా రైతులు
వరంగల్ జిల్లా పర్వతగిరిలోని పీఏసీఎస్ సొసైటీ వద్ద బారులు తీరిన రైతులు
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులో రోడ్డుపై బైఠాయించి జొన్న రొట్టెలు తింటున్న మహిళా రైతులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సొసైటీ వద్ద యూరియా కోసం వచ్చిన రైతులకు భోజనాలు పెట్టిస్తున్న బీఆర్ఎస్ నాయకులు
మంచిర్యాల జిల్లా భీమారం రైతు వేదిక వద్ద రైతులకు నచ్చజెప్పుతున్న కలెక్టర్ కుమార్‌దీపక్
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపహాడ్‌లో యూరియా లేక మక్కజొన్న పంట ఎదగకపోవడంతో బర్రెలను మేపుతున్న రైతు
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం లక్ష్మిదేవునిపల్లిలో యూరియా కోసం లైన్లో ఉంచిన చెప్పులు, సీసాలు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో యూరియా కోసం క్యూలో వేచిఉన్న రైతులు