పెద్దకొత్తపల్లి/తిమ్మాజిపేట, జనవరి 21 : యూరియా లేకుండా కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్య క్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి రైతువేదికలో ఏర్పాటుచేసిన యూరియా అదనపు కేంద్రానికి బుధవారం ముష్టిపల్లి, మరికల్, చంద్రకల్, పెరుమాళ్లపల్లి గ్రామాల రైతులు తాళం వేసి నిరసన తెలిపారు.
యూరియా స్టాక్ లేక పోవ డంపై ఆగ్రహంతో నిర్వాహకులను ని లదీశారు. 400 బస్తాల స్టాక్ ఉన్నదని, తీసుకెళ్లిన రైతులే మళ్లీ వస్తున్నారని ఏఓ శిరీష తెలిపారు. ఇదే జిల్లా తిమ్మాజిపేటలో కొందరికే యూరియా ఇవ్వడంతో నిరాశతో వెనుదిరిగారు.