నర్సింహులపేట, నవంబర్ 2: ఎమ్మా ర్పీ కంటే అధిక ధరకు యూరియా విక్రయిస్తుండటాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురంలో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా బస్తా ఎమ్మార్పీ రూ.266 ఉం డగా, జయపురంలో రూ.300కు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారని రైతులు మం డిపడ్డారు.
వ్యవసాయ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆదివారం జయపురంలోని రైతువేదిక వద్ద రైతులు ఆందోళన చేశారు. రవాణా చార్జీ పేరిట బస్తాపై అదనంగా రూ.30 వరకు చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. అదనంగా వసూలు చేస్తు న్న ఎరువుల షాపుల యజమానులపై చ ర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.