Rythu Bharosa | హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ రైతుభరోసా మళ్లీ ఆగిపోయింది. గత నెల 26న పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో కొంతమంది రైతులకు రైతుభరోసా జమచేసిన సర్కారు ఆ తర్వాత 10 రోజులకు అంటే ఈ నెల 5న ఎకరం భూమి ఉన్న రైతులకు ఇచ్చినట్టు ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ నిలిపివేసింది. 6వ తేదీన రెండు ఎకరాల రైతులకు రైతుభరోసా అందాలి. కానీ, ఐదు రోజులు గడుస్తున్నా.. రైతుల ఖాతాల్లో పైసా జమ కాలేదు. ఈ విధంగా యాసంగి రైతుభరోసా పంపిణీ ఆగుతూ సాగుతున్నది. ఈ యాసంగిలో సుమారు 1.5 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.8,400 కోట్లు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా వెల్లడించారు.
అయితే ఇప్పటి వరకు కేవలం 21.45 లక్షల మంది రైతులకు రూ.1,126.54 కోట్లు మాత్రమే పెట్టుబడిసాయం అందజేశారు. ఈ లెక్కన రైతులకు ప్రభుత్వం ఇం కా రూ.7,274 కోట్లు బాకీ పడింది. ఈ బాకీ ఎప్పటి వరకు తీర్చుతుందో స్పష్టత లేదు. అసలు తీర్చుతుందో, ఎగ్గొడుతుందోననే అనుమానాలు వ్య క్తమవుతున్నాయి. వారం, పది రోజులకోసారి కొంతమంది రైతులకు రైతుభరోసా ఇస్తూపోతే యాసంగి సీజన్ పూర్తయి… వానకాలం మొదలైనా పంపిణీ పూర్తికాదనే విమర్శలు వస్తున్నాయి. ఎంత మంది రైతులకు, ఎ ప్పుడు, ఎంత విస్తీర్ణానికి ఇస్తున్నారనే వివరాలను ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడించలేదు. యాసంగి రైతుభరోసా ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది.
ఇస్తారో.. ఎగ్గొడతారో?
రైతుభరోసా కోసం రాష్ట్రవ్యాప్తం గా రైతులు కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే యాసంగి పంటల సాగు పూర్తయింది. పెట్టుబడి సా యం అందుతుందనే ఆశతో రైతులు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పె ట్టారు. కానీ, కాంగ్రెస్ సర్కారు రైతు ల ఆశలపై నీళ్లు చల్లుతూ ఇదిగో.. అ దిగో అంటూ ప్రకటనలకే పరిమితమైంది. దీంతో అప్పులు తీసుకొచ్చిన రైతులు వాటిని చెల్లించే మార్గం లేక నానా తంటాలు పడుతున్నారు. దీం తో రైతులు సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలు వేసేటప్పుడు ఇవ్వాల్సిన సాయం.. కోతలు దగ్గరపడుతున్నా ఇవ్వడం లేదంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే రైతుభరోసాపై మాట తప్పిన కాంగ్రెస్ స ర్కారు.. అరకొర సాయాన్ని కూడా ఇస్తుందో, లేదోననే సందేహాలు వ్య క్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఎకరానికి రూ.15 వేలు ఇస్తామంటూ హా మీ ఇచ్చి ఇప్పుడు రూ.12 వేలే ఇస్తామని మాటతప్పిన విషయాన్ని రైతు లు గుర్తుచేస్తున్నారు. వానకాలం మాదిరిగానే యాసంగికి సైతం రైతుభరోసా ఎగ్గొడుతుందేమోనని చర్చించుకుంటున్నారు.