రాయపర్తి, ఫిబ్రవరి 26 : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తెట్టకుంట తండాకు చెందిన రైతు ఇస్లావత్ యాకూబ్ పొట్ట దశకు వచ్చిన తన వరి పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. రెండు ఎకరాల పొలంలో వరి పంట సాగు చేయగా, బోర్లలో చుక్క నీరు రావడం లేదు.
దీంతో కండ్ల ముందే పంట చేను ఎండిపోవడాన్ని చూసి తట్టుకోలేక ఒక్కో ట్యాంకర్‌కు రూ.800 చొప్పున చెల్లిస్తూ పంటను తడుపుతున్నాడు. కాంగ్రెస్ సర్కారు తీరుతో భూగర్భ జలాలు అడుగంటడంతో యాకూబ్ పడుతున్న అరిగోస రాష్ట్రంలోని అన్నదాతల దుస్థితిని కండ్లకు కడుతున్నది. ట్యాంకర్‌తో నీటిని అందిస్తూ ఇబ్బందులకు గురవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి.