అచ్చంపేట రూరల్, నవంబర్ 14: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండ లం సింగారం గ్రామానికి చెందిన రైతు శక్కునాయక్ తన పంటకు కరెంటు సక్రమంగా అందడం లేద ని 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్‌కు బుధవారం తాళం వేశాడు. ఇందుకు సంబంధించి ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో గురువారం వార్త ప్రచురితమైంది.
ఈ వార్తకు విద్యుత్తు అధికారులు స్పందించారు. ఏఈ ఆంజనేయు లు, జేఎల్ఎం మూడవత్ సీతారాంనాయక్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి రైతుతో చర్చలు జరిపి తాళం తీయించారు. దీంతో ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేసి మిగతా 17 మంది రైతు ల పొలాలకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. ఏ ఈ ఆంజనేయులును వివరణ కోరగా.. రైతు అనాలోచితంగా చట్టాన్ని అతిక్రమించాడని, ప్రభుత్వం 24 గంటలపాటు విద్యుత్తును అందిస్తున్నదని తెలిపారు.