భైంసా టౌన్, జూలై 3 : దిగుబడులు రాక.. అప్పులు తీర్చే పరిస్థితి లేక గురువారం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మహగాంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. మహగాం గ్రామానికి చెందిన కుంటాల రాకేశ్ (25) తనకున్న ఎకరం భూమిని సాగు చేయడంతోపాటు కిరాణ దుకాణం నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. పత్తి సాగుకోసం రూ.8 లక్షల అప్పు చేశాడు.
సరైన దిగుబడి రాకపోవడంతో అప్పుల తీర్చే మార్గం లేక మ ద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గురువారం గుండేగాం రంగారావ్ పల్సికర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాడు. పిల్లలను బాగా చూసుకోవాలని సూసైడ్ నోట్ రాసి ప్రాజెక్ట్ బ్రిడ్జి పైన పెట్టి నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.