నాగర్ కర్నూల్ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి పోతే అన్నదాతలు ( Farmers ) అడుగడుగునా అవస్థలు పడుతున్నారు. నారు వేసినప్పటి నుంచి పంట పండి విక్రయించేంత వరకు అన్ని ఇబ్బందులే. కాలం కలిసి వచ్చి విక్రయానికి మార్కెట్కు తరలిస్తే నిబంధనల పేరిట నిలువు దోపిడే.
గిట్టుబాటు ధర లేదని పత్తి పంటకు నిప్పంటించిన రైతన్న
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో గిట్టుబాటు ధర లేక, కూలీల ధరలు భరించలేక మూడు ఎకరాల పత్తి పంటకు నిప్పు పెట్టిన రైతు
పంట పండించడం ఎంత కష్టమో, అమ్ముకోవడం అంతకన్నా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు pic.twitter.com/RQVvvsAEwf
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2025
ధర వస్తుందని గంపెడాశతో పంట పండిస్తే గిట్టు ధర రాక చివరకు ఓ రైతు కన్నీరు కారుస్తూ పంటను స్వయాన దహనం చేసుకున్నాడు. నాగర్ కర్నూల్ ( Nagar kurnool ) జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో ఓ రైతు తనకున్న మూడు ఎకరాలలో అనేక వ్యయ ప్రయాసాల కోర్చి, ప్రకృతిని తట్టుకుని పత్తి పంటను పండించాడు.
ప్రస్తుతం పత్తి పంటకు గిట్టుబాటు ధర లేక, కూలీల ధరలు భరించలేక మూడు ఎకరాల పత్తి పంటకు నిప్పు పెట్టుకున్నాడు. పంట పండించడం ఎంత కష్టమో, అమ్ముకోవడం అంతకన్నా కష్టంగా మారిందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.