జఫర్‌గఢ్, జనవరి 24 : విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యానికి రైతు బలైన ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లులో శనివారం చోటుచేసుకున్న ది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు పెండ్యాల భిక్షపతి (39) తన పొలానికి నీళ్లు పెట్టేందుకు బావి వద్దకు వెళ్లాడు. మోటర్‌కు కరెంట్ సరఫరా కాకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించాడు. ఫ్యూజ్ కట్ అయిన విషయాన్ని గుర్తించి జేఎల్ఎం శ్రీనివాస్, లైన్‌మన్ కుమారస్వామికి చెప్పి ఎల్సీ కావాలని కోరాడు. ఎల్సీ ఇచ్చినట్టు చెప్పడంతో రైతు భిక్షపతి ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి ఫ్యూజ్ అమరుస్తుండగా విద్యుత్తు సరఫరా కావడంతో షాక్‌కు గురై కిందపడటంతో గమనించిన తోటి రైతులు దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. లైన్‌మన్ కుమారస్వామి ఎల్సీ ఇచ్చిన తర్వాత సమాచారం ఇవ్వకుండానే ఎల్సీ రిటర్న్ చేయించడంతో విద్యుత్తు సరఫరా జరిగి రైతు మృతి చెందినట్టు కుటుంబ సభ్యు లు, గ్రామస్థులు ఆరోపించారు.