మెదక్ రూరల్ (హవేళీఘన్పూర్ ) ఫిబ్రవరి14: మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం కూచన్పల్లిలో విద్యుత్ షాక్కు గురై ఓ రైతు మృతిచెందాడు. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన రైతు కుకుట్ల లచ్చయ్య (52) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
శనివారం పొలంలోని బోరుబావి వద్ద విద్యుత్ వైరు సరిచేయడానికి యత్నిస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పక్కపొలాల్లో ఉన్న వారు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు చేరుకుని చూడగా అప్పటికే లచ్చయ్య మృతి చెందాడు. మృతుడి భార్య సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మెదక్ ఏరియా దవాఖానకు తరలించారు.