గద్వాల అర్బన్, జూలై 2 : వ్యవసాయ పొలం దున్నుతుండగానే గుండెపోటుకు గురై యువ రైతు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది.
కేటీదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన రైతు మాల వీరేశ్ (30) గురువారం తన పొలం దున్నుతున్న క్రమంలో గుండెపోటు రావడంతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు.