కోడేరు, ఏప్రిల్ 5 : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం గుండెవాల్యా నాయక్తండాలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన కాట్రావత్ లోకారం(39) ఉదయం 6గంటల ప్రాంతంలో వ్యవసాయ పొలానికి వెళ్లాడు. మక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు బోరు మోటర్ స్టార్టర్ ఆన్ చేస్తుండగా అప్పటికే తెగిపడిన విద్యుత్తు తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య కమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.