కొందుర్గు, ఏప్రిల్ 17: విద్యుత్తు షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల పరిధిలోని పర్వతాపూర్‌లో గురువారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతాపూర్‌కు చెందిన రైతు అశోక్‌రెడ్డి (35) పక్క పొలంలో నుంచి తన పొలానికి వెళ్తుండగా అప్పటికే వర్షానికి తెగిపడి ఉన్న కరెంటు తీగలు తగలడంతో షాక్‌కు గురై మరణించాడు.
విద్యుత్తు శాఖ తప్పిదంవల్ల అశోక్‌రెడ్డి మృతిచెందినట్టు బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చిన్నఎల్కిచర్ల సబ్‌స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణం పోయిందని ఆరోపించారు.