నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధాన్యం రాశి వద్దే ఓ రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని బాబాసాహెబ్ గూడెంకు చెందిన ఎండీ నసీరుద్దీన్ (68) ఉదయం నెల్లిబండ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లాడు. తన ధాన్యం రాశి వద్ద ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
గమనించిన స్థానికులు నసీరుద్దీన్‌ను నకిరేకల్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గతంలోనే గుండెకు స్టంట్స్ పడిన రైతు గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నసీరుద్దీన్ మృతితో బంధువుల రోదనలు మన్నంటాయి.