పెద్దమందడి, నవంబర్ 17 : ప్రమాదవశాత్తు వరికోత మిషన్‌లో పడి రైతు మృతిచెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సై శివకుమార్ కథనం మేరకు.. వనపర్తి మండలం అంకూర్కు చెందిన రైతు రాకాసి శ్రీనివాస్‌రెడ్డి (45)కి పెద్దమందడి మండలం బలిజపల్లి శివారులో నాలుగున్నర ఎకరాల భూమి ఉన్నది.
పొలంలో వరి సాగు చేయగా.. పంట కోతకు రావడంతో సోమవారం మిషన్‌తో వరి కోయించేందుకు పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మిషన్‌లో పడి అక్కడిక్కడే మృతి చెందాడు.