గోపాల్పేట, అక్టోబర్ 6 : ట్రాక్టర్ రొటవేటర్లో ఇరుక్కొని ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై నరేశ్ కథనం మేరకు.. ఏదుట్లకు చెందిన సంకెళ్ల పరశురాముడుకు చెందిన భూమిలో పరశురాముడుతోపాటు సూగూరు సాయికృష్ణ, పాన్‌గల్ మండలం కేతపల్లికి చెందిన ఎజ్జు రాజ్‌కుమార్ (29) కలిసి వ్యవసాయం చేస్తున్నారు.
ఆదివారం రొటవేటర్‌తో పొలం దున్నేందుకు పరశురాముడు, రాజ్‌కుమార్ వెళ్లారు. రాజ్‌కుమార్ రొటవేటర్ బ్లేడ్ బిగిస్తుండగా పరశురాముడు ట్రాక్టర్ ముందుకు కదిలించాడు. దీంతో రొటవేటర్ బ్లేడు బిగిస్తున్న రాజ్‌కుమార్ ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కొని అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడి తండ్రి అగ్గి రాయుడు సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.