ఆలూర్, మే 15: పొలం వద్ద వైర్లు సరిచేస్తుండగా కరెంట్ షాక్తో రైతు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలో చోటుచేసుకున్నది. కల్లెడి గ్రామానికి చెందిన ఉమ్మెడ చిన్న గంగారాం అలియాస్ చిన్నారెడ్డి (50) బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లి స్టార్టర్కు కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ తగిలింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిజామాబాద్ దవాఖానకు తరలించారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.