బాలానగర్, అక్టోబర్ 14 : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కటిక హరిలాల్ (40) సోమవారం ఉదయం ఆవులను మేపేందుకు సమీపంలోని తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. అక్కడే ఉన్న విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ వైపు ఆవు వెళ్తుండగా.. అదిలించేందుకు అటుగా వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన కేబుల్‌కు తగిలి విద్యుత్తు షాక్‌కుగురై అక్కడికక్కడే మరణించాడు. జడ్చర్ల దవాఖానలో శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్టు ఎస్సై తిరుపాజీ తెలిపారు.