టేకులపల్లి, అక్టోబర్ 2: వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగివస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో ఎడ్లబండి కొట్టుకుపోగా రైతు మృతిచెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కొత్తతండా(పీ) గ్రా మంలో బుధవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు ఆంగోత్ గాంధీ (35) ఉదయం తన భార్యతోపాటు మరికొందరు మహిళలతో కలిసి ఎడ్లబండిపై లక్ష్మీపురం గ్రామం మీదుగా తన చేనుకు వెళ్లారు.
సాయంత్రం ఇంటికి తిరిగివస్తున్న క్రమంలో లక్ష్మీపురం సమీపాన ఉన్న గంగమ్మతల్లి వాగులో ఎడ్లబండి కొట్టుకుపోయింది. ఎగువ న కురిసిన వర్షానికి వరద పెరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. స్థానికులు వెంటనే మహిళలను రక్షించారు. ఎడ్లబండి మీదపడటంతో గాంధీ మృతిచెందాడు.