మద్దూర్ (కొత్తపల్లి), ఆగస్టు 23 : రుణం కోసం వచ్చిన ఓ రైతు గుండెపోటుతో బ్యాంకు వద్ద మరణించాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మద్దూర్లో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. మద్దూరు మండలం బొమ్మన్పహాడ్కు చెందిన రైతు గవినోళ్ల కతలప్ప అలియాస్ అబ్బాస్ (50) శుక్రవారం మద్దూర్ మండల కేంద్రంలోని ఎస్బీఐకి రుణం కోసం వచ్చాడు.
బ్యాంకులో చాలామంది ఉండటంతో క్యూలో నిలబడ్డాడు. ఈ సమయంలో ఒక్కసారిగా కింద పడిపోగా.. స్థానికులు స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు తెలిపారు. కతలప్పకు భార్య గోవిందమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కొత్తగా రుణం కోసం కొన్నిరోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నట్టు వారు తెలిపారు.