చిన్నకోడూరు, నవంబర్ 17 : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరుకు చెందిన కర్నే రాంరెడ్డి (70) అతడి తమ్ముడు యాదగిరిరెడ్డికి మధ్య భూ వివాదం ఉన్నది. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలు నిర్వహించినా సమస్య పరిషారం కాలేదు. ఆర్థికసమస్యలతోపాటు తల్లి పోషణ గురించి వారం రోజులుగా దిగాలు చెందుతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు లేచి పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి, పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.