మానకొండూర్ రూరల్, డిసెంబర్ 30 : సాగునీటి కోసం తండ్లాడాడు. బావి తవ్వినా ప్రయోజనం లేకపోవడం, బోరు వేయించినా చుక్క నీరు పడకపోవడంతో మనస్తాపం చెంది రై తు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా గట్టుదుద్దెనపల్లిలో విషాదాన్ని నింపింది. బంధువులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లికి చెందిన గొర్రెంకల చిన్న ఎల్లయ్య (55)కు నాలుగెకరాల భూమి ఉంది.
సాగు నీటి కోసం ఆరు నెలల క్రితం బావి తవ్వగా బండ రావడంతో మనస్తాపం చెందాడు. మంగళవారం తన వ్యవసాయ భూమిలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సంజీవ్ తెలిపారు.