బచ్చన్నపేట, ఏప్రిల్ 1 : సాగు నీళ్లు లేక పంట ఎం డిందని, అప్పులు మీదపడ్డాయని మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపూర్‌లో చోటుచేసుకున్నది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపూర్‌కు చెందిన ఒగ్గు మహేశ్ (42) ఎకరం భూ మిలో అప్పు తెచ్చి వరి సాగు చేశాడు. నీళ్లు లేక ఎండిపోయింది. సుమారు రూ. ఐదు లక్షల వరకు అప్పు కాగా, వాటిని తీర్చే మార్గంలేక కుమిలిపోయాడు. సో మవారం పురుగుమందు తాగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు.
కరెంట్ షాక్‌తో యువరైతు మృతి ; పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి..
గంగాధర, ఏప్రిల్ 1 : పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ యువ రైతు విద్యుత్తు షాక్‌తో మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కురిక్యాల గ్రామానికి చెందిన రైతు ఒగ్గరి ప్రశాంత్ (35) మంగళవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టడానికి బావి వద్దకు వెళ్లాడు. మోటర్ స్విచ్ ఆన్ చేయడానికి డబ్బా తెరిచే క్రమంలో విద్యుత్తు షాక్ కొట్టడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. చికిత్స కోసం కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశాంత్ మృతదేహానికి నివాళులర్పించి.. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రశాంత్ కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.