ఉట్నూర్ రూరల్, నవంబర్ 12 : ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంట దిగుబడి రాదని, అప్పు లు ఎలా తీర్చాల నే బెంగతో రైతు అర్క భీంరావు (31) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం చింతగూడ కు చెందిన అర్క భీంరావు బోథ్ మం డలం బాబేరలోని అత్తవారి ఇంటి వద్దే ఉంటూ వారిచ్చిన ఐదెకరాల్లో మొక్కజొన్న, స్వగ్రామంలో మూడెకరాల్లో పత్తి, రెండెకరాల్లో వరి వేశాడు.
పెట్టుబడి కోసం ఉట్నూర్‌లోని శాతవాహన గ్రామీణ బ్యాంకులో రూ.2 లక్షలు, ప్రైవేటుగా మరో రూ.2 లక్షలు అప్పు చేశాడు. పంట ఎదగక దిగుబడి వచ్చే అవకాశం లేకపోవడం, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక భీంరావు మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు.