తలమడుగు, జనవరి 4 : రైతుభరోసా రాక.. సాగు కోసం చేసిన అప్పులు భారంగా మారడంతో ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం ఝరి గ్రామానికి చెందిన రైతు గడ్డం పోతారెడ్డి (51) తనకున్న ఏడెకరాల భూమిలో పత్తి వేశాడు. రైతుభరోసా రాకపోవడంతో సాగు కోసం దాదాపు రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు.
సరైన దిగుబడులు రాక చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై శనివారం ఉదయం చేను వద్ద పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. చికి త్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెం దాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అంజమ్మ తెలిపారు.