చిన్నశంకరంపేట, మే 27: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకొన్న ఘటన మెదక్ జిల్లా చి న్నశంకరంపేట మండలం గజగట్లపల్లిలో బుధవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. గజగట్లపల్లికి చెందిన రాజయ్య(45) తనకు ఉన్న అర ఎకరం వ్యవసాయ భూమి లో వ్యవసాయం చేసుకుంటూ బోరుబావు తవ్వించాడు.
దీంతో రూ.2.50 లక్షల వరకు అప్పులు అయ్యాయి. కొద్దిరోజుల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లగా, అక్కడ పనిచేయలేక ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో కొన్నిరోజులుగా ఆర్థిక సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతుడి కుమారుడి మహేశ్ ఫిర్యాదు మేరకు చిన్నశంకరంపేట ఎస్సై శివానందం కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు.