తరిగొప్పుల. జనవరి3: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రైతు ఆత్మహ త్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా తరిగొప్పులలో జరిగింది. ఏఎస్సై రాజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన జిట్ట వీరప్రకాశ్ (51) జనగామ జిల్లా తరిగొప్పులలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలుచేశాడు.
అందులో వరి, మక్కజొన్న, పామాయిల్ సాగు చేశాడు. గత సంవత్సరం అకాల వర్షా లతో పంట నష్టం జరిగింది. ఈ నేప థ్యంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక శనివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు.