వాజేడు, నవంబర్ 20: అప్పుల పాలై ఓ రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలోని చెరుకూరులో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లొటపిటల నర్సింహూలు (62) మూడేళ్లుగా రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని మిర్చి పంట సాగుచేస్తున్నాడు.
ఆశించిన స్థాయిలో పంట ది గుబడి రాక అప్పుల పాలయ్యడు. చేసిన అప్పులు తీర్చే మా ర్గం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలిపనికి వెళ్లి వచ్చిన భార్య వెంకటలక్ష్మి ఇంటికి వచ్చి చూడగా నర్సింహులు చనిపోయి ఉన్నాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.