ముస్తాబాద్, జూలై 12 : అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకుని ఆత్మహ త్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్లో చోటుచేసుకున్నది. ఎస్సై జ్యోతి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఈరవేణి పర్శరాములు (42) కొద్దిపాటి పొలంలో అప్పు చేసి బోర్లు వేసినా ఆశించిన నీరు పడలే దు. మరికొంత అప్పుచేసి కొడుకు ను ఉపాధి కోసం కువైట్ పంపించగా, అక్కడ సరైన పనిలేక మూడు నెలలకే తిరిగొచ్చాడు. 13 లక్షల అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెందిన పర్శరాములు శనివారం ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు.
కరెంటు షాక్తో రైతు మృతి
సోన్, జూలై 12 : నిర్మల్ జిల్లా సోన్ మండలం బొప్పారంలో ఓ రైతు కరెంట్ షాక్తో మరణించాడు. రాచర్ల ముత్యం(48)కు రెండున్నర ఎకరాల్లో పంట వేయడానికి వరి నారు పోశాడు. నారుకు నీరు పెట్టడానికి ఆదివారం పొలానికి వెళ్లాడు. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ వైరును ప్రమాదవశాత్తు తాకడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు.