ఖానాపూర్, జూలై 26 : దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘట న నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో చోటుచేసుకున్నది. పోలీసు లు, కుటుంబ సభ్యులు తెలిపిన వి వరాల ప్రకారం.. సుర్జాపూర్ గ్రా మానికి చెందిన రైతు సంగ రాము లు(65) మూడేండ్ల క్రితం ఎకరం భూమి తీసుకున్నాడు. ఇందులో వరి వేశాడు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. దీనితోడు అతని భార్య యశోద అనారోగ్యం పాలవడంతో రూ.6 లక్షల వరకు దవాఖానలో ఖర్చు చేశాడు.
భూమి కొనుగోలు, వైద్యం తదితర ఖర్చులన్నీ కలిపి రూ.20 లక్షలు ప్రైవేట్ అప్పు చేశాడు. ప్లాట్ అమ్మితే రూ.6 లక్షల రాగా కొంత మేర అప్పు తీర్చాడు. మిగతా అప్పు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురయ్యాడు. కు టుంబం గడవడం కష్టం కావడం.. అప్పులు తీర్చాలనే ఒత్తిళ్లు రావడంతో మనోవేదనకు గురైన రాము లు శనివారం ఉదయం తన చేను లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యా దు మేరకు ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.