చేర్యాల, ఆగస్టు 1 : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై అపూర్వరెడ్డి తెలిపిన వివరాల ప్రకా రం.. చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన కడ్డూరి రాములు (64) తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో ఎకరన్నర పత్తి సాగు చేయగా, మిగిలిన భూమిలో వరి సాగు చేసుకునేందుకు నారుపోశాడు. దీనికోసం రూ.3లక్షల మేరకు అప్పులు అయ్యాయి.
కాలం కలిసి రాకపోవడంతో మనస్తాపం చెంది శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన ఎస్సై అపూర్వరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య లలిత, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.