వనపర్తి టౌన్, సెప్టెంబర్ 28 : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ సర్కిల్ ఆఫీస్ భవన పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని ఓ గదికి సంబంధించిన పీవోపీ సీలింగ్ ఒక్కసారిగా కూలింది. భారీ శబ్దంతో సీలింగ్ ముక్కలు, ఇనుప ఫ్రేములు కిందపడ్డాయి.
ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది. ఈ ఘటనతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.