జగదేవపూర్, మే 21: అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల మేరకు.. జగదేవపూర్ మండలం నిర్మల్నగర్కు చెందిన కర్రె మల్లేశం (48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పంట పెట్టుబడికి రూ.2 లక్షలు, కుమార్తె వివాహానికి రూ.4 లక్షల వరకు అప్పుచేశాడు. ఈ క్రమంలో తీవ్ర ఆవేదన చెందిన మల్లేశం ఈనెల 10న పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆర్వీఎం దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై సుభాష్ తెలిపారు.