కడుపుబ్బా నవ్విస్తున్న కనకరాజు
‘సినిమా విజయంపై మొదటి నుంచి మాకు పూర్తి నమ్మకం ఉంది. మేము ఊహించిన దానికంటే ప్రేక్షకులు అద్భుతమైన ఆదరణ కనబరుస్తున్నారు. ప్రతీ ఎపిసోడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు బాబు పుట్టిన తర్వాత ఈ విజయం రావడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తున్నది’ అన్నారు హీరో వరుణ్‌తేజ్.
‘సినిమా విజయంపై మొదటి నుంచి మాకు పూర్తి నమ్మకం ఉంది. మేము ఊహించిన దానికంటే ప్రేక్షకులు అద్భుతమైన ఆదరణ కనబరుస్తున్నారు. ప్రతీ ఎపిసోడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు బాబు పుట్టిన తర్వాత ఈ విజయం రావడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తున్నది’ అన్నారు హీరో వరుణ్‌తేజ్. ఆయన నటించిన హారర్ కామెడీ డ్రామా ‘కొరియన్ కనకరాజు’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ఫ్రేమ్ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. శుక్రవారం సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వరుణ్‌తేజ్ పైవిధంగా స్పందించారు. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాలనే లక్ష్యంతో ఈ సినిమా చేశామని, తమ ప్రయత్నం ఫలించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ ‘వరుణ్‌తేజ్ కటౌట్‌కు తగిన సినిమా ఇది. కనకరాజు, కొరియన్ పాత్రల్లో ఆయన అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచారు. సత్య కాంబినేషన్లో ఆయన పండించిన కామెడీ హైలైట్‌గా నిలిచింది’ అన్నారు. చాలా రోజుల తర్వాత పెద్ద విజయం దక్కిందని, థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు చూస్తుంటే సంతోషంగా ఉందని నిర్మాత రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శిరీష్ కూడా పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

