ఆత్మకూరు (ఎం), మార్చి 22 : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం రాయిపల్లికి చెందిన రైతు నాతి మల్లయ్యగౌడ్ (57) అప్పులబాధతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లయ్యకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయంతోపాటు గీత వృత్తిని కొనసాగిస్తున్నాడు. తన కూతురు పెండ్లితోపాటు పంట పెట్టుబడుల కోసం అప్పు చేశాడు. చేతికొచ్చిన వరి పంట ఎండిపోవడంతో అప్పు ఎలా తీర్చాలని ఆవేదనకు గురయ్యాడు. మొత్తం రూ.20 లక్షల అప్పు తీర్చే మార్గంలేక శనివారం తన వ్యవసాయ బావి వద్ద పురుగులమందు తాగాడు. గమంచిన తోటి రైతులు హైదరాబాద్లోని గాంధీ ధవాఖానకు తరలించగా చికిత్స పొం దుతూ ఆదివారం మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునన్నట్టు సీఐ హనుమంతు తెలిపారు.