బాన్సువాడ, జనవరి 25: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని గూడెగల్లీకి చెందిన రైతు బల్సుకూరి చిన్న గంగారాం(47) అప్పుల బాధతో ఉ రేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ సీఐ తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగారాం భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా డు. నాలుగేండ్ల క్రితం ఇల్లు కట్టుకున్నాడు. పంటలు సరిగ్గా పండకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. జీవితంపై విరక్తితో ఆదివారం తన పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.