ధర్పల్లి, డిసెంబర్17: కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధలతో అన్నదాతలు అసువులు బాసుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందితో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘ టన ని జామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకున్నది. పో లీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ధర్పల్లికి చెందిన రైతు దేశబోయిన పోశన్న (47) రెండు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ, పోలీసుస్టేషన్లో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. త రచూ అదే విషయా న్ని ఆలోచిస్తూ ఐదు రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. బుధవారం ఉదయం 6. 30 గంటల సమయం లో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి శుభ్రం చేసి ఇంటికి వచ్చిన పోశన్న.. పొలానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. ఎంతకూ తిరిగి రాకపోయే సరికి భార్య పొలం వద్దకు వెళ్లి చూడగా, టేకు చెట్టుకు ధోతితో ఉరి వేసుకుని విగత జీవిగా వేలాడుతూ కనిపించాడు. మృ తుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.