జడ్చర్ల టౌన్, ఆగస్టు 25 : రైతు భరోసా అందక.. అప్పుల భారం మోయలేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లి పంచాయతీ పరిధిలోని రణంగుట్ట తండాకు చెందిన రైతు విస్లావత్ రవి (40)కి ఎకర్నర పొలం ఉన్నది. నిరుడు రెండు బోర్లు వేయగా నీళ్లు పడలేదు. అప్పటికే వ్యవసాయం కలిసిరాక.. దాదాపు రూ.4 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ ఏడాది రైతు భ రోసా డబ్బులు అందకపోవడంతో.. వానకాలంలో పొలం బీడుగా ఉంచాడు. ఈ క్రమంలో అప్పులు మీద పడటంతో తీవ్ర మనస్తాపంతో సోమ వారం ఉద యం 9 గంటలకు తన పొలంలో పురుగు మందు తాగాడు. గుర్తించిన సమీపంలోని రైతులు వెంటనే రవి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారు జడ్చర్ల ప్రభుత్వ దవాఖానకు.. అక్కడి నుంచి మహబూబ్‌నగర్, హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ దవాఖానకు తీసుకెళ్లారు. మధ్యాహ్నం తరువాత మరణించాడు.