కౌటాల, మార్చి 7 : అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేటలో జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. గుండాయిపేట చెందిన రైతు ఎల్ములే బాబురావు (51)కు 5 ఎకరాల భూమి ఉంది. రూ. 2 లక్షల వరకు అప్పు చేసి అందులో పత్తి వేయగా, 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఆ భూమి పైనే బాబురావు.. అతడి భార్య మాయాబాయి బ్యాంకులో రూ. 2 లక్షల రుణం తీసుకున్నారు. వీరికి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు. ఓ వైపు బ్యాంకు రుణం మాఫీకాక.. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక బాబురావు తీవ్ర మనస్తాపం చెందాడు. అవితీర్చే మార్గంలేక గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.