పత్తిపంట దక్కలేదని రైతు ఆత్మహత్య.. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో విషాదం
వర్షాలకు పత్తి పంట దెబ్బతినడంతో తీవ్రమనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్నది.
- వర్షాలకు దెబ్బతినడంతో మనస్తాపం
వాంకిడి, నవంబర్ 2 : వర్షాలకు పత్తి పంట దెబ్బతినడంతో తీవ్రమనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడికి చెందిన రైతు బుట్లే సుధాకర్ (34) తనకున్న 5 ఎకరాలతోపాటు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. సుమారు రూ.2.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. రెండు నెలల క్రితం యూరియా కొరత, ఎడతెరిపి లేని వానలతో మొక్కలు సరిగా ఎదగలేదు.
ఇటీవల మొంథా తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు పత్తి పంట మరింత దెబ్బతిన్నది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక తీవ్ర మనస్తాపం చెందాడు. ఆదివారం ఇంటి సమీపంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి వాంకిడిలోని ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు వాంకిడి ఎస్సై మహేందర్ తెలిపారు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

