మహబూబ్‌నగర్: యూరియాపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం రైతుల ప్రాణాల మీదకు తెస్తున్నది. రాత్రనక, పొద్దనక యూరియా సోకం ఆగ్రో సెంటర్ల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతలు అనారోగ్యానికి గురవుతున్నారు. శనివారం ఉదయం మహబూబ్‌నగర్ (Mahabubnagar) పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం వద్దకు యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ రైతుకు ఫిట్స్ రావడంతో పడిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. స్వయంగా ఆ రైతును అంబులోకి ఎక్కించారు.