ములుగు : బీఆర్ఎస్ పాలనలో రైతులు కాలర్ ఎగరేసి దర్జాగా పంటలు పండించేలా చేస్తే కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అధికారుల కాళ్లు పట్టుకునేలా చేస్తున్నారు. సాగు పనులు మొదలు పెట్టి నెల గడిచి పోయినా యూరియా అందక ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు సైతం లెక్క చేయకుండా గంటల కొద్ది క్యూలైన్లో నిలబడుతున్నారు. తాజాగా ములుగు జిల్లాలో యూరియా కోసం ఓ రైతు కలెక్టర్ కాళ్లు పట్టుకోవడం పలువురిని కంటతడిపెట్టించింది.
వివరాల్లోకి వెళ్తే..ములుగు జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు చేస్తున్న ఆందోళన విషయం తెలుసుకొని పిఎసిఎస్ కార్యాలయానికి కలెక్టర్ టీ.ఎస్. దివాకర చేరుకొని రైతులకు నచ్చ చెబుతున్న క్రమంలో తమకు ఇబ్బందులు లేకుండా యూరియా అందించాలని కలెక్టర్ కాళ్లు మొక్కాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. కాగా, అందరికి యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నచ్చజెప్పారు.