సిరిసిల్ల రూరల్, జూలై 17: ఆర్థిక ఇబ్బందులతో ఓ కౌలు రైతు ఆత్మహత్యకు యత్నించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెకు చెందిన పసు ల స్వామి (28) గ్రామంలోని ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాడు. వ్యవసాయంతోపాటు సొంత ట్రాక్టర్ ద్వారా వ్యవసాయ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో ట్రాక్ట ర్ కొనుగోలు చేయడంతో అప్పుల పాలయ్యాడు.
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేక మనస్తాపానికి గురైన ఆయన గురువారం మధ్యాహ్నం పొలం వద్ద గడ్డి మందు తాగాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు.