హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం, రవాణాశాఖ ఫ్యాన్సీ నంబర్ల ధరలను సవరించి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసినట్టు శనివారం అధికారికంగా ప్రకటించింది. సవరించిన ధరల ప్రకారం 9999 నంబర్‌కు గతంలో రూ.50వేలు ఉండగా, ఇప్పుడు రూ.1.50 లక్షలు పెట్టి బిడ్డింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇలా పలు ఫ్యాన్సీ నంబర్లకు గతం లో ఉన్న ధరను రెట్టింపు చేసింది.