బంజారాహిల్స్, జూన్ 23 : బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఉద్దేశించి తప్పుడు కథనాలు ప్రసారం చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై మహా న్యూస్ చానల్ ఎండీ వంశీకృష్ణపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఇటీవల బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన సందర్భంగా బాధితుల పక్షాన నిలిచిన ప్రవీణ్‌కుమార్‌ను లక్ష్యంగా చేసుకొని మహాన్యూస్ చానల్ లో అడ్డగోలు వార్తా కథనాలు ప్రసారం చేశారంటూ సీహెచ్ ఉదయ్‌కుమార్ నార్సింగి పోలీసులకు ఫి ర్యాదు చేశారు.
ఈ చానల్ ప్రసారం చేసిన కథనా లు దళితవర్గానికి చెందిన ప్రవీణ్‌కుమార్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు అనంతరం దానిని జూబ్లీహిల్స్ పీఎస్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు మహా న్యూస్‌కు చెందిన వంశీపై బీఎన్ఎస్ 352 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.