హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): వార్ధా ప్రాజెక్టు అంచనా వ్యయానికి సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా పలు పత్రికలు అసత్యాలను ప్రచారంచేస్తూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయి. పనిగట్టుకొని ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.750 కోట్ల నుంచి 4,550.73 కోట్లకు ఎగబాకిందని ఆరోపణలు చేస్తున్నాయి. వాస్తవంగా 2018లో వార్ధా బరాజ్ నిర్మాణ ఖర్చు రూ.750 కోట్లు ఉంటుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. అది కేవలం బరాజ్ ఖర్చు మాత్రమే కానీ మొత్తం బీఆర్ అంబేదర్ వార్ధా ప్రాజెక్టు అంచనా వ్యయం కాదు. ప్రస్తుతం 2022-23 ఎస్‌ఎస్‌ఆర్‌తో లెక గట్టి బరాజ్ సహా ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయాన్ని రూ.4,550.73 కోట్లుగా నిర్ధారించింది. ఈ మేరకు కేంద్ర జలసంఘానికి ఆమోదం కోసం పంపించిన సంగతి తెలిసిందే. అందులో భూసేకరణ, బరాజ్, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, ఫీల్డ్ చానళ్లు, కరకట్టలు, పంప్‌హౌజ్‌లు, విద్యుత్తు సబ్స్టేషన్లు, రెగ్యులేటర్లు, క్రాస్ డ్రైనేజీ స్ట్రక్చర్లు, బ్రిడ్జీలు, నిర్వహణ ఖర్చులతోపాటు, 18 శాతం జీఎస్టీ వ్యయం రూ.622.40 కోట్లుగా ఉండటం గమనార్హం.
వాస్తవంగా తగ్గిన ఖర్చు
ప్రభుత్వం బరాజ్ స్థలాన్ని వార్ధా నదిపైకి మార్చినందువల్ల నిర్మాణ ఖర్చు గణనీయంగా తగ్గింది. ఇతరత్రా అనేక సాంకేతిక సమస్యలు తొలగిపోయాయి. బరాజ్ పొడవు తుమ్మిడిహట్టి వద్ద మట్టికట్టలతో 6.45 కిలోమీటర్లు ఉంటే అది వార్ధాపైన కుడి, ఎడమ మట్టికట్టలను కలుపుకొని 1,751 మీటర్లకు తగ్గింది. తుమ్మిడిహట్టి బరాజ్‌కి ఎడమవైపున చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉండటం వల్ల అనుమతుల సాధన అసాధ్యం. ఇక తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణ ఖర్చును 2007-08 ఎస్‌ఎస్‌ఆర్‌తో లెక గట్టినప్పుడు రూ. 1,919 కోట్లు. ఏటా 5 శాతం పెరుగుదలతో లెకిస్తే అది ఇప్పుడు రూ.3,262 కోట్లకు ఎగబాకుతున్నది. వార్ధా బరాజ్ నిర్మాణ ఖర్చు ఇప్పుడు సుమారు 800 కోట్లు మాత్రమే. అయినప్పటికీ కొన్ని పత్రికలు మాత్రం దురుద్దేశంతో ప్రాజెక్టు ఖర్చు 750 కోట్ల నుంచి 4,550.73 కోట్లకు ఎగబాకిందని రాయటంపై ఇంజినీర్లు మండిపడుతున్నారు. బరాజ్ ఖర్చునే వారు ప్రాజెక్టు ఖర్చుగా చూపించి కనీస అవగాహన లేకుండా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని భారీగా పెంచారని, తప్పుడు రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వార్ధా బరాజ్ ముఖ్యాంశాలు
ఉమ్మడి ఏపీ ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బరాజ్