మహబూబ్‌నగర్ అర్బన్, మార్చి 18 : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కమ లం పార్టీలో చేరుతున్నట్టు అధికార, ప్రతిపక్షాల నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ధ్వజమెత్తారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. పనిగట్టుకుని ఒక నేతను ఇరుకున పెట్టేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి వల్లే బీజేపీని ముఖ్యనాయకులు వీడారాని తెలిపారు. పార్టీలు మారే వ్యక్తి ఇప్పుడు కమలం పార్టీని విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.