Secretariat | హైదరాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సచివాలయంలో నకిలీ ఉద్యోగుల దందా రోజుకొకటి వెలుగులోకి వస్తున్నది. ఇటీవలే నకిలీ రెవెన్యూ ఉద్యోగిని, ఎమ్మార్వోను గుర్తించగా తాజాగా ఏకంగా నకిలీ ఐఏఎస్‌ను పట్టుకున్నారు.
బాలకృష్ణ అనే వ్యక్తి ఐఏఎస్‌గా చెప్పుకొంటూ దందాలు చేస్తున్నట్టు సచివాలయ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సచివాలయ సీఎస్‌వో దేవీదాస్ ఆదేశాలతో నిఘా పెట్టిన పోలీసులు బుధవారం నకిలీ ఐఏఎస్ బాలకృష్ణను పట్టుకున్నారు. ఆయనపై సైఫాబాద్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. జీఏడీ వ్యవహారాలు చూస్తున్నానంటూ నమ్మించి పలువురికి ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్టు గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.